విద్యాశాఖ అధికారులతో సిఎం జగన్‌ సమీక్ష సమావేశం

అమరావతి: ఏపి సిఎం జగన్‌ సోమవారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..స్కూళ్లలో టాయిలెట్ నిర్వహణ నిధిపై కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి, పాఠశాల లేదా కళాశాల స్థాయిలో కమిటీలు వేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలన్నారు. మరమ్మతు రాగానే బాగుచేసేలా చర్యలు ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.

ఆంగ్ల మాధ్యమం ద్వారా నాణ్యమైన బోధన తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/