ఐపిఎల్ కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యుఎఇ లో

Green signal to IPL
Green signal to IPL

New Delhi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో జరుగుతుంది.

టోర్నమెంట్‌ను దేశం నుంచి బయటకు తరలించడానికి భారత ప్రభుత్వ అనుమతి బోర్డు క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) కు లభించింది.

ఐపీఎల్ పాలక మండలి ఆదివారం సమావేశమైన తర్వాత ఈ అనుమతి వచ్చింది. యుఎఇలో మ్యాచ్ లు అన్ని రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి

ఇప్పటికే ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి తీసుకున్న బీసీసీఐ.. కేంద్రాన్ని ఒప్పించడానికి తీవ్రంగానే శ్రమించింది.

ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కీలక పాత్ర వహించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/