ఒక్కరు కూడా తోడు లేరు.. ఒంటరి అయ్యాం: ఉక్రెయి ప్రెసిడెంట్ ఆవేద‌న‌

హైదరాబాద్: ర‌ష్యాతో జ‌రుగుతున్న పోరాటంలో తాము ఒంట‌రిగా మిగిలిపోయామ‌ని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ దేశాల సాయం అందుతుంద‌ని భావించామ‌ని కానీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంట‌రిగా మిగిలామ‌న్నారు. ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేరా? అని మిత్ర‌ప‌క్ష దేశాల‌ను అడుగుతున్నాన‌ని తెలిపారు. రష్యాతో పోరాటంలో ఒంటరిగా మిగిలామని పేర్కొన్నారు. నాటోలోని 30 దేశాలకు కాల్స్ చేశామని.. స్పందన లేక ఏకాకిమయ్యాం అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రష్యా దాడిలో ఇప్పటివరకు 137మంది ఉక్రెయిన్​ పౌరులు మరణించినట్లు అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ వెల్లడించారు. వందల మంది గాయపడినట్లు చెప్పారు. ఒక వేళ త‌మ‌కు మ‌ద్ద‌తుగా ఉంటే నాటో కూట‌మిలోకి మ‌మ్మ‌ల్ని తీసుకోవ‌డానికి ఎందుకు సిద్ధంగా లేరు అని ప్ర‌శ్నించారు. మా దేశ భ‌ద్ర‌త హామీల గురించి మాట్లాడేందుకు తాము భ‌యప‌డం.. కానీ త‌మ దేశ ర‌క్ష‌ణ మాటేమిటి అని అడిగారు. ఆ హామీని ఏ దేశాలు త‌మ‌కు అందిస్తాయి అనేదే చూస్తున్నామ‌ని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

మరోవైపు జెలెన్​స్కీ కూడా కదనరంగంలోకి దూకారు. ఉక్రెయిన్‌ ఆర్మీ నిరుత్సాహ పడకుండా.. నేను కూడా మీతోనే ఉన్నానంటూ ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతిక్షణం రష్యా అటాక్స్‌ను పరిశీలిస్తున్న జెలెన్‌స్కీ..పుతిన్‌ను ఢీ కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశం కోసం పోరాడాల్సి వస్తే ముందుండేది సైనికుడే. కానీ, ఆ సైనికుడి కంటే ముందు తానుంటానంటూ మనో ధైర్యం కల్పిస్తున్నారు. తమకు సాయం చేసేందుకు నాటో దళాలు సహా ఎవరూ ముందుకు రాకపోవడంతోదేశ పౌరులే ఆయుధాలు చేతబట్టి పోరాడాలని వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ సైన్యం తన పని తాను చేసుకుపోతుందన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.. పరిస్థితి చేతులు దాటి పోతుండడంతో పౌరులకు పిలుపు ఇచ్చాడు. ఆపై సైన్యాన్ని వెంట ఉండి నడిపిస్తుండడం, సూచనలు ఇస్తుండడంతో.. సిసలైన నాయకుడంటూ సోషల్‌ మీడియా అభినందిస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/