నేడు ఢిల్లీకి పవన్.. TDP, JSP, BJP పొత్తు ఖరారయ్యేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొత్తుల అంశం కొనసాగుతుంది. ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తు ఫిక్స్ కాగా..వీరితో బిజెపి కలుస్తుందా..లేదా అనేది కొద్దీ రోజులుగా ఉత్కంఠ రేపుతుంది. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు ఢిల్లీ కి వెళ్లగా..ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన TDP అధినేత చంద్రబాబు నిన్న అమిత్ షా, నడ్డాతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉండగా ఇవాళ పవన్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి TDP, JSP, BJP పొత్తుపై షా, CBN, పవన్ కలిసి చర్చిస్తారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటూ కొలిక్కి వచ్చే ఛాన్సుంది. ఇక ఈ మూడు పార్టీల పొత్తు ఫిక్స్ అయినట్లే అని తెలియడం తో వైసీపీ బిజెపి ఫై విమర్శలు చేయడం మొదలుపెట్టింది.