స‌రిహ‌ద్దుల్లో ప్ర‌తి రోజు 50 నుంచి 100 మంది చ‌నిపోతున్నారు: జెలెన్‌స్కీ

కీవ్: ఉక్రెయిన్ తూర్పు స‌రిహ‌ద్దుల్లో ప్ర‌తి రోజు 50 నుంచి 100 మంది మ‌ర‌ణిస్తున్నార‌ని ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఆదివారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్రాణాలు కోల్పోయిన‌వారంతా దేశాన్ని ర‌క్షిస్తున్న‌వారే అన్నారు. డాన్‌బాస్ ప్రాంతంలో ర‌ష్యా ద‌ళాలు భీక‌రంగా యుద్ధం చేస్తున్న విష‌యం తెలిసిందే. సివెరొడోన‌స్కీ న‌గ‌రంపై ర‌ష్యా బ‌ల‌గాలు ఫోకస్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇక స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ స‌ద‌స్సును ఉద్దేశించి జెలెన్‌స్కీ మాట్లాడ‌నున్నారు. ఈ స‌మావేశాల‌కు ర‌ష్యా అధికారులు వెళ్ల‌డం లేదు. ఉక్రెయిన్ ప్ర‌తినిధి బృందం వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/