5 ఫైటర్ జెట్లను కూల్చేశామ కూల్చేశాం: ఉక్రెయిన్ ప్రకటన

పలు నగరాల్లో మకాం వేసిన రష్యా సైనికులు
రష్యాకు దీటుగా సైన్యాన్ని మోహరించామన్న ఉక్రెయిన్

కీవ్: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా బలగాలు దూసుకుపోయాయి. మిస్సైళ్లు, బాంబులతో ఉక్రెయిన్ నగరాలపై దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై కూడా రష్యా ఆధిపత్యం సాధించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్ ప్రతిఘటించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కీలక ప్రకటన చేసింది. రష్యాకు చెందిన 5 ఫైటర్ జెట్లను కూల్చేశామని తెలిపింది. రష్యాకు దీటుగా సైన్యాన్ని మోహరించామని చెప్పింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ రష్యా పూర్తి స్థాయిలో దురాక్రమణకు దిగిందని… ఈ యుద్ధంలో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/