దీపావళి వేడుకల్లో పాల్గొన బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌

uk-pm-rishi-sunak-at-diwali-celebrations

లండన్ : బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం రాత్రి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో రిషి సునాక్‌ పాల్గొన్నారు. ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… బ్రిటన్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఫోటోను కూడా షేర్ చేశారు.

బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్‌ వైదొలగడంతో బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి నేతగా రికార్డు సృష్టించారు.