పుష్ప ప్రమోషన్ ఈవెంట్ లో యాంకర్ ఉదయభాను పెద్ద తప్పుచేసింది

పుష్ప మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో యాంకర్ ఉదయభాను పెద్ద తప్పు చేసి ట్రోల్స్ కు గురైయ్యింది. అల్లు అర్జున్ – సుకుమార్ – దేవి శ్రీ కలయిక లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప . గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లు రాబడుతూ లాభాల బాట పడుతుంది. మొదటి మూడు రోజులు భారీ వసూళ్లే రాబట్టిన ఈ మూవీ..సోమవారం కాస్త తగ్గడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ లను స్పీడ్ చేసింది. ఈ క్రమంలో తిరుపతి మంగళవారం సక్సెస్ మీట్ ను ఏర్పటు చేసింది. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ , రష్మిక లతో పాటు మిగతా నటి నటులు , సాంకేతిక వర్గం హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి సీనియర్ యాంకర్ ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ..సినిమా 203 కోట్లు కలెక్షన్ సాధించిందని చెప్పబోయి ఒకేసారి 2003 కోట్లు రాబట్టినట్లు అని ఉదయభాను గట్టిగా చెప్పేసింది. అంతే సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ను అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక చాలా కాలం తర్వాత మళ్ళీ యాంకర్ గా దర్శనమిచ్చిన ఉదయభాను ఇలా పొరపాటు చేయడం తో చిత్ర యూనిట్ సైతం ఆగ్రహం గా ఉన్నారు. ఇప్పటికే సినిమాకు 200 కోట్లు రావడం నమ్మబుద్ధి కావడం లేదని హెటర్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయభాను 2003 కోట్లు రాబట్టిందని చెప్పడం తో నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు.