ఒక్క ఆర్ఆర్ఆర్ కు మాత్రమే ఆ ఘనత దక్కింది

తెలుగు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా జనవరి 07 వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేయబోతున్నారు. దీంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయి లో జరగడమే కాదు ఇండియా లో ఏ చిత్రానికి జరగని స్థాయిలో జరిగింది.

తాజాగా ఈ చిత్రం అదిరిపోయే సంచలన రికార్డును నమోదు చేసుకుంది. అమెరికాలో ఎక్కువ థియేటర్లలో విడుదలవుతోన్న ఏకైక సినిమాగా ఆర్ఆర్ఆర్ రికార్డు నెలకొల్పింది. ఇది అక్కడ తెలుగులో 1000, హిందీలో 793, తమిళంలో 291, మలయాళంలో 66, కన్నడంలో 62 ఇలా ఐదు భాషల్లో కలిపి 2212 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్‌లో విడుదల కాలేదు. ఫస్ట్ టైం ఆర్ఆర్ఆర్ కు మాత్రమే ఆ ఘనత దక్కింది. మరి రిలీజ్ తర్వాత కలెక్షన్ల పరంగా ఇంకెన్ని రికార్డ్స్ నెలకొల్పోతుందో చూడాలి.