కేటీఆర్ ఒక్క ట్వీట్ తో 12 మందిఫై కేసు

ర్యాగింగ్ భూతం అనేది మరోసారి హైదరాబాద్ లో కలకలం రేపింది. హైదరాబాద్ లోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ లో ఓ మతానికి చెందిన విద్యార్థిని మరో మతానికి చెందిన పలువురు విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. అయితే తనపై జరిగిన ర్యాగింగ్ ఘటనను తెలుపుతూ బాధిత విద్యార్థి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు నేరుగా ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వెలుగులోకి వచ్చినంతనే సైబరాబాద్ పరిధిలోని శంకర్ పల్లి పోలీసులు ర్యాగింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

ర్యాగింగ్ అనంతరం విద్యార్థులు కాలేజ్ గ్రూప్స్ లో వీడియోలను అప్లోడ్ చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇరువురిని రాజీకుదుర్చీ పంపించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఘటనపై బాధిత విద్యార్థి మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో ఫిర్యాదు చేయడం తో .. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కేటీఆర్ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచించారు. మంత్రి ట్వీట్ తో ర్యాగింగ్ కు పాల్పడిన 12మందిపై శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ 12 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సంవత్సరం పాటు సస్పెండ్ చేసింది. దర్యాప్తు అనంతరం మరికొంత మంది స్టూడెంట్స్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. IBS కాలేజీ విద్యార్ధులకు.. దొంతనపల్లి గ్రామ శివారులో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.