ఆగస్టులోనే విదేశీ విద్యార్థులకు అమెరికా అనుమతి

హైదరాబాద్‌ కాన్సులేట్‌ ట్విట్టర్ లో పోస్ట్

U.S. admission of foreign students in August
U.S. admission of foreign students in August

Hyderabad: కరోనా వైరస్‌ కట్టడికి అమెరికా నిబంధనలు అమలులో ఉన్న కారణంగా విదేశీ విద్యార్థులందరికీ ఆగస్టు 1 తరువాత మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని హైదరాబాద్‌ కాన్సులేట్‌ మంగళవారం ట్విట్టర్ ద్వారా ప్రకటన లో పేర్కొంది. వీసా (ఎఫ్‌)లు పొందినప్పటికీ ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి కారణంగా వారిని దేశంలోకి అనుమతించలేమని తేల్చింది. భారత్‌తోపాటు చైనా, ఇరాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విద్యార్థులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/