మూడోసారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం

కరోనా కారణంగా అతి తక్కువ మందికే ఆహ్వానం

Mamata Banerjee sworn in as CM for the third time
Mamata Banerjee sworn in as CM for the third time

పశ్చమ బెంగాల్ మూడో సారి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. . అతి తక్కువ మంది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్‌ జగదీప్ ధన్‌కడ్ మమతతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ సహా కొందరు నేతలకే ఆహ్వానాలు పంపించారు. మమత మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వంటి కొద్దిమంది హాజరయ్యారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది .బెంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లు గెలుపొందింది. బీజేపీ 77 స్థానాల్లో ఇతరులు 2 చోట్ల విజయం సాధించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/