ఏపీలో సరికొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడి

New corona virus strain
New corona virus strain

  • తొలుత కర్నూలులో గుర్తింపు , విశాఖ, అమరావతి ప్రాంతాల్లో వ్యాపిస్తున్న వైనం!
  • యువకులు, పిల్లల్లోనూ వ్యాపించే అవకాశం:
  • ప్రజలు మంచి మాస్క్ ఎల్లప్పుడూ ధరించడం,
  • వీలైనంత వరకు ఇంట్లో ఉండడం చాలా అవసరం: వైద్యులు వెల్లడి

ఏపీలో సరికొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ బయటపడిందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ ఇండియాలో ఇప్పుడు ఉన్న వైరస్ కంటే 15 రెట్లు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కరోనాకు చెందిన 5 వేరియంట్లు కనుగొన్నారు. వీటిలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో ఏపీ స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది చెబుతున్నారు.

ఏపీ స్ట్రెయిన్ వైరస్ సోకిన రోగులు 3-4 రోజుల్లో హైపోక్సియా లేదా డిస్ప్నియా గురవుతారని, ఈ పరిస్థితిలో శ్వాస రోగి ఊపిరితిత్తులకు చేరుకోవడం ఆగిపోతుంది. సరైన సమయంలో చికిత్స లేకపోవడం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల రోగి మరణిస్తాదాని పేర్కొంది. . ఈ వైరస్ చైన్ సమయానికి విచ్ఛిన్నం కాకపోతే ఈ సెకండ్ వేవ్ కరోనా మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్ట్రెయిన్ కర్నూలులో మొదట గుర్తించారు. ఈ వైరస్ విశాఖపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్ రాజధానిలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతొందని తెలిసింది. ఏపీలోని కర్నూలులో మొదట గుర్తించామని, ఇది సామాన్య ప్రజలలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. వైరస్ ఇప్పుడు మూడు లేదా నాలుగు రోజుల్లో రోగులు పరిస్థితి విషమంగా మారుతోందని, అందుకే ఆక్సిజన్, బెడ్స్, ఐసీయూ పడకల అవసరం బాగా పెరిగిందని ఏపీలోని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఈ వేరియంట్ యువకుల్లోనూ పిల్లల్లోనూ కూడా వ్యాపించే అవకాశం ఎక్కువ ఉంది. ప్రజలు మంచి మాస్క్ ఎల్లప్పుడూ ధరించడం, గుంపులకు దూరంగా ఉండటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, వీలైనంత వరకు ఇంట్లో ఉండడం చాలా అవసరం అని అని వైద్యులు పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/