సమయాను సారంగా చేసే పనులు

ఎవరికైనా ఉండేది 24 గంటలే. కొంతమందేమో ఆ సమయంలోనే పనులన్నీ చక్కబెట్టేసుకుని ఏ టెన్షన్‌ లేకుండా ఉంటే మరికొందరేమో సమయం లేదని తెగ బాధపడుతుంటారు. అలా కాకుండా సమయాన్ని ఆదా చేసుకోవడం తెలిస్తే మీరు హాయిగా ఉండవచ్చు. నచ్చిన అభిరుచుల కోసం సమయాన్ని కేటాయించవచ్చు.

Woman job working
Woman job working

నెలవారీ సరుకులను కొనడానికి సాధారణంగా జాబితాని రాస్తూనే ఉంటాం. అలాగే మనం చేయాల్సిన పనులను కూడా ఒకచోట రాసిపెట్టుకోవాలి. ఒక్కోసారి రాసే సమయానికి అన్ని పనులూ గుర్తుకు రాకపోవచ్చు. అలాంటప్పుడు గుర్తున్నవి రాసి పెటుట్కఉని ఆ తర్వాత మిగతా వాటిని కలవచ్చు. ఆఫీసుకు చేరుకునే క్రమంలో ఎక్కువ సేపు బస్సులోనే ప్రయాణించాల్సి రావచ్చు. అలాంటప్పుడు కూడా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

అవసరమైన ఈ మెయిల్స్‌కు సమాధానాలు పంపవచ్చు. లేదా ఎవరికైనా మెయిల్‌ చేయాల్సి ఉంటే వెంటనే పెట్టవచ్చు. మీరు చేయాల్సిన పనుల లిస్టును టెక్నాలజీ సాయంతో తగ్గించుకోవచ్చు. మీ మీ మొబైల్‌ ఫోన్‌లో అవసమైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటితో నగదు బదిలీ చేయవచ్చు. మొబైల్‌ రీచార్జి చేయవచ్చు. కరెంటు బిల్లులను కట్టేయవచ్చు. ఇలా చేయడం వల్ల గంటల కొద్దీ క్యూలో నిల బడాల్సిన బాధ తప్పుతుంది. సమయం ఆదా అవుతుంది.

పొద్దుటే వ్యాయామం చేయాలని, అరగంటపాటైనా ధ్యానం చేయాలని, కాస్త ప్రశాంతంగా టిఫిన్‌ చేయాలని అనుకుంటారు చాలా మంది. కానీ సమయం సరిపోక ఇవేవీ చేయలేరు. రోజూ లేచే సమయాని కంటే ఒక గంట ముందు అలారం పెట్టుకోండి. అలారం మోగినప్పుడు వెంటనే లేవడానికి బద్ధకించినా అరగంట తర్వాతైనా మెల్లగా లేవగలుగుతారు.

ఈ సమయాన్ని ఎప్పటి నుంచో చేయలేక పోతున్న పనులకు వినియోగిచండి. అరగంట ముందు లేవడం వల్ల ఎంత హైరానా తగ్గు తుందో, ఎంత ప్రశాంతంగా ఉండగలుగు తారో మీకే తెలుస్తుంది. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు చేయడం ఇష్టం లేకపోయినా మొహమాటంతో కొందరు చేయడానికి ఒప్పేసుకుంటారు.

సహోద్యోగులు, స్నేహితు లతో ఎక్కడ మనస్పర్థలు వస్తాయోననే భయంతో కాదని చెప్పడానికి సంకోచిస్తుంటారు. దానివల్ల ఎంతో విలువైన సమయాన్ని నష్ట పోతుంటారు. అలాకాకుండా మీకు సమయం లేనప్పుడు సున్నితంగా మీవల్ల కాదని చెప్పే యండి. ఆ సమయంలో ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం మీ పనులను పూర్తి చేసుకోండి. దీనివల్ల ఎంత సమయం ఆదా అవుతుందో మీ పనులెంత త్వరగా పూర్తవు తాయో అనుభవపూర్వకంగా మీకే తెలుస్తుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/