మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఇద్దరు కోమటిరెడ్డిలు పోటీ

Two Komati Reddys are contesting in the munugod by-election

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రేపు శుక్రవారం తో నామినేషన్ల పర్వం సైతం ముగుస్తుండడంతో ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో ఇద్దరు కోమటిరెడ్డి లు బరిలోకి దిగుతుండడం తో ఇప్పుడు చర్చ గా మారింది. ఉప ఎన్నిక బరిలో ‘కోమటిరెడ్డి’ ఇంటి పేరుతో ఉన్న ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఒకరు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాగా.. మరొకరు కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి.

సాయితేజరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ‘కమలం పువ్వు’ను కేటాయిస్తారు. ఇక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న రెండో అభ్యర్థి సాయితేజ రెడ్డి కు ఈసీ ఏ గుర్తు కేటాయిస్తారనేది నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరమే తెలుస్తుంది. కోమటిరెడ్డి ఇంటిపేరుతో ఓటర్లు కన్‌ప్యూజ్‌కు గురైతే.. బీజేపీకి దక్కాల్సిన కొన్ని ఓట్లు రెండో అభ్యర్థికి వెళ్లే అవకాశం ఉంటుంది. రెండో అభ్యర్థి ఎన్నికల గుర్తు కూడా ‘కమలం’ను పోలి ఉంటే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. మరి సాయితేజ రెడ్డి కి ఏ గుర్తు వస్తుందో అని ..బిజెపి వర్గం ఖంగారు పడుతుంది.