తండ్రిని స్మరించుకున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్ధంతి ఈరోజు. ఈ సందర్భాంగా మెగా బ్రదర్స్ ఆయనను స్మరించుకున్నారు. ట్విట్టర్ ద్వారా చిరంజీవి ట్వీట్ చేసారు. తమ జీవిత విజయాలకు బాటను ఏర్పరిచారని భావోద్వేగానికి గురయ్యారు. ‘మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పెంచి, మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి, మా విజయాలకు బాటనేర్పరచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్భంగా స్మరించుకుంటున్నాము’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో వాల్తేర్ వీరయ్య మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు మెహర్ రమేష్ డైరెక్షన్లో భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు.