శ్రీవారి ఆర్జితసేవ టికెట్లు విడుదల

TTD
TTD

తిరుమల: శ్రీవారి అర్జితసేవ ఆన్‌లైన్‌ టికెట్లు జూన్‌ నెలకు సంబంధించి టీటీడీ ఈరోజు విడుదల చేసింది. జూన్ నెల కోటా కింద మొత్తం 60,666 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో సుప్రభాతం 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాద దర్శనం 1,725 టికెట్లు విడుదలయ్యాయి. ఆన్‌లైన్ జనరల్ కేటగిరీలో 50,700 టికెట్లు విడుదల చేశారు. ఇందులో విశేష పూజ 1500, కల్యాణం 13,300, ఊంజల్ సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్రదీపాలంకార సేవ 17,400 టికెట్లు ఉన్నాయి. కాగా ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,966 టికెట్లు విడుదల చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/