బీసీలపై ముఖ్యమంత్రి జగన్‌కు ఎందుకంత కక్ష?

చిత్తశుద్ధితో పని చేస్తున్న టిడిపిని విమర్శిస్తారా?

nara lokesh
nara lokesh

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం బీసీల హక్కుల కోసం, సుప్రీంకోర్టులో వాదించాల్సింది పోయి, చిత్తశుద్ధితో ఆ పని చేస్తున్న టిడిపి పార్టీని విమర్శిస్తారా? అని టిడిపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బీసీలపై ముఖ్యమంత్రి జగన్‌కు దొంగ పత్రికకు ఎందుకంత కక్ష? అని విమర్శించారు. 16 వేల మంది బీసీలకు అధికారం దూరం చేసి, మొత్తం మీరే ఎలుతారా? అని లోకేష్‌ మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో 22 శాతం మాత్రమే రిజర్వేషన్‌ ఉంది, మన రాష్ట్రంలో ఉంటే తప్పేంటి అంటూ రాతలు రాస్తారా? పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీ మర్చిపోయారా అని సీఎం జగన్‌ను లోకేష్‌ ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/