సిద్ధిపేటలో నూతన నిర్మాణాలను ప్రారంభించిన కెసిఆర్
హాజరైన మంత్రులు

Siddipet: సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన ముందుగా సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. తొలుత సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును సీఎం ప్రారంభించారు. జీ 1తో ఎకరం విస్తీర్ణంలో కట్టిన బంగళాను ప్రారంభించారు. అనంతరం ఆయన కొండపాక మండలం రాంపల్లి శివారులో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. తదుపరి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాలనూ ప్రారంభించారు. మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/