దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మాగాంధీ

బాపూజీకి సీఎం కెసిఆర్ నివాళి

TS CM KCR pays tribute to Bapuji
TS CM KCR pays tribute to Bapuji

Hyderabad:ప్రపంచానికి అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మాగాంధీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కేసిఆర్ ఆయనకు నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ అహింస, సత్యాగ్రహదీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కీర్తించారు.

దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని మహాత్మాగాంధీ జీవితం చాటి చెబుతోందని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/