మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రూ. 3 వేల కోట్ల జరిమానా

Trump asked to pay $350 million penalty in civil fraud case, he says ‘total sham’

న్యూయార్క్‌ః మరోమారు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించాలని పట్టుదలగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బ్యాంకులను మోసం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు 364 మిలియన్ డాలర్ల (రూ. 3 వేల కోట్లకు పైగా) జరిమానా విధించింది. ట్రంప్ తన ఆస్తుల వాస్తవిక విలువను అధికంగా చూపించి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. ఇలా మోసపూరితంగా వ్యాపార రుణాలు, బీమా పొందారని న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ దావా వేశారు. దీనిపై ఇటీవల రెండున్నర నెలలపాటు కోర్టు విచారణ జరిపింది.

ఈ ఆరోపణలు నిజమని తేలడంతో న్యాయమూర్తి ఆయనకు 365 మిలియన్ డాలర్ల జరిమానా విధించడంతోపాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన మూడేళ్లపాటు డైరెక్టర్‌గా కానీ, అధికారిగా కానీ ఉండకూడదని న్యాయస్థానం నిన్న తీర్పు వెలువరించింది. అయితే, ఇది సివిల్ కేసు కావడంతో జైలు శిక్ష విధించలేదని పేర్కొంది. అయితే, ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ట్రంప్ తరపు న్యాయవాదులు తెలిపారు. కాగా, ట్రంప్‌ ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.