బిజెపి అగ్రనేతలకు టిఆర్ఎస్ గ్రాండ్ వెల్​కమ్

అదేంటి బిజెపి అగ్రనేతలకు టిఆర్ఎస్ వెల్​కమ్ చెప్పడం ఏంటి అనుకుంటున్నారా..? ఇది నిజమే కాకపోతే టిఆర్ఎస్ నేతలు చెప్పడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రాజెక్ట్ లు ఇలా అన్ని హోర్డింగ్స్ రూపంలో వెల్​కమ్ చెపుతున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత బిజెపి జాతీయకార్యనిర్వహణ సమావేశాలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. రేపు , ఎల్లుండి జరగబోయే ఈ సమావేశాలకు ప్రధాని మోడీ తో పాటు బిజెపి అగ్ర నేతలు , కేంద్ర మంత్రులు , పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా చాలామందే హాజరుకాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు కూడా. ఈ తరుణంలో వారికీ గ్రాండ్ వెల్​కమ్ బిజెపి చెప్పాలి కానీ ఆ ఛాన్స్ వారికీ ఇవ్వకుండా టిఆర్ఎస్ వెల్​కమ్ చెప్పేసింది.

గత కొద్దీ నెలలుగా బిజెపి vs టిఆర్ఎస్ వారు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బిజెపి సమావేశాలను టిఆర్ఎస్ వాడుకుంటుంది. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది..ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారనేది బిజెపి నేతలందరికీ తెలియజేసేలా..రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోర్డింగులు, గ్లో సైన్​ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎనిమిదేండ్ల నుంచి తెలంగాణ ఎలా పురోగమిస్తున్నది.. వివిధ రంగాల్లో ఎలా దూసుకెళ్తోంది అనే అంశాలతో వీటిని రూపొందించారు. హైదరాబాద్​ సిటీలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఇంగ్లిష్‌లో ఏర్పాటు చేసిన హోర్డింగులు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులకు తెలంగాణ సాధిస్తున్న ప్రగతి మీద అవగాహన కలగడానికి వీలుగా వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే.. వీటిని చూసి బీజేపీ నాయకులు షాక్ అవుతున్నారు.

ఈ హోర్డింగులు తమ జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల నాయకులు చూస్తే తెలంగాణ బీజేపీ పరువు గంగలో కలుస్తుంది అని వారు మాట్లాడుకుంటున్నారు. నిజానికి తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏవీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. అభివృద్ధి సూచీల్లో కూడా తెలంగాణ కన్నా బీజేపీ రాష్ట్రాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ఈ హోర్డింగుల ద్వారా బీజేపీ అగ్ర నాయకత్వానికి టీఆర్ఎస్ పెద్ద షాక్ ఇచ్చినట్టే చెప్పాలి.