చిరంజీవి ‘గాడ్ ఫాదర్ ‘ లుక్ ముహూర్తం ఫిక్స్..

మెగా స్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడం తో మేకర్స్ ప్రమోషన్ ఫై దృష్టి పెంచారు. ఈ తరుణంలో సినిమా తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసారు. జూలై 04వ తేదీన సాయంత్రం 5.45 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్నట్లు ప్రీ లుక్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ ప్రీ లుక్ లో వర్షం పడుతుండగా.. కొంతమంది నల్ల రంగు కలిగిన గొడుగులు పట్టుకుని ఉన్నారు. ఎదురుగా ఓ కారు నిల్చొని ఉంది. దానికి ఎదురుగా ఎర్ర గొడుగు పట్టుకుని ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ పిక్ తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు ’సల్మాన్ ఖాన్’ కీలక పాత్రలో కనిపించనున్నారు. సల్మాన్ – చిరు మధ్య ఓ పాట ఉంటుందని.. ఈ పాట అభిమానులను కిక్ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఈ డ్యాన్స్ కు కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవ వ్యవహరించగా.. సంగీతం ఎస్. తమన్ అందించారు. నయన తార, పూరి జగన్నాథ్ లు కూడా స్పెషల్ రోల్స్ పోషించారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే… ఇటీవలే ’ఆచార్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ తో పాటు భోళా శంకర్ , చిరు 154 లు చేస్తున్నాడు.