గమనించగలరు : రేపు, ఎల్లుండి హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో రేపు , ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు గమనించగలరు. రేపు, ఎల్లుండి ఐటీ కారిడార్‌లో వాహనాలను దారి మళ్లించనున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారులు సూచించారు.

దారి మళ్లింపు ఇలా..

-నీరూస్‌ జంక్షన్‌ నుంచి కొత్తగూడ, గచ్చిబౌలి జంక్షన్‌ వైపు వచ్చే వాహనదారులు సీఓడీ జంక్షన్‌ వద్ద నుంచి వయా దుర్గం చెరువు, ఇనార్బిట్‌ మాల్‌, ఐటీ సీ కోహినూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ, గచ్చిబౌలికి చేరుకోవాలి. గచ్చిబౌలి నుంచి నీరూస్‌ జంక్షన్‌కు వెళ్లేవారు ఇదే మార్గాన్ని ఉపయోగించుకోవాలి.

-మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ, సైబర్‌ టవర్స్‌, జూబ్లీహిల్స్‌ వైపు వచ్చే వాహనదారులు రోలింగ్‌ హిల్స్‌, ఏఐజీ దవాఖాన, ఐకియా, ఇనార్బిట్‌, దుర్గం చెరువు మీదుగా ప్రయాణించాలి. హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌ వైపు వెళ్ళొద్దు.

-రామచంద్రపురం, చందానగర్‌ నుంచి మాదాపూర్‌, గచ్చిబౌలి వచ్చే వాహనదారులు బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ట్రిపుల్‌ ఐటీ, గచ్చిబౌలి మార్గాన్ని వాడుకోవాలి. ఆల్విన్‌, కొండాపూర్‌ రోడ్డు వైపు వెళ్ళొద్దు.

ఈ మార్గాల్లో భారీ వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు..

-జేఎన్‌టీయూ నుంచి సైబర్‌ టవర్స్‌.
-మియాపూర్‌ నుంచి కొత్తగూడ.
-బయోడైవర్సిటీ నుంచి జేఎన్‌టీయూ.
-నారాయణ కాలేజీ నుంచి గచ్చిబౌలి.

రేపు , ఎల్లుండి బిజెపి కార్యనిర్వహణ సమావేశాలు HICC లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి అగ్ర నేతలు, ఇతర రాష్ట్ర బిజెపి ముఖ్యమంత్రులు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే చాలావరకు హైదరాబాద్ కు చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం మోడీ రానున్నారు. ఎల్లుండి సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగబోయే బిజెపి సభ లో మోడీ పాల్గొననున్నారు.