అమెరికా పిలుపును వ్యతిరేకిస్తున్న చైనా

america-china
america-china

చైనా: ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి మిగతా దేశాలు కూడా బయటికి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. ఎంతో కసరత్తు జరిగిన తర్వాత 2015లో ఇరాన్‌తో అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్‌, చైనా, జర్మనీ, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు అణుఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చింది. ఒప్పందం నుంచి మిగతా దేశాలు కూడా బయటికి రావాలని ట్రంప్‌ తరుచుగా కోరుతున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి ఒప్పందం నుంచి అమెరికా బయటికి వెళ్లడమే కారణం అని చైనా పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/