రేపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Traffic restrictions in Hyderabad for Telangana budget session

హైదరాబాద్‌ః రేపటి నుండి (శుక్రవారం) తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్‌, బషీర్‌బాగ్‌, రవీంద్రభారతి, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకాపూల్‌, ఎంజే మార్కెట్‌, నాంపల్లిలో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని చెప్పారు.