కవితకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ సంతోష్

హైదరాబాద్: నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పుట్టిన రోజు. ఈ సందర్బంగా రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. నా ప్రియ‌మైన సోద‌రికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. నువ్వు నా స్నేహితురాలిగా ఎన్నో ఏండ్ల నుంచి క‌లిసి ఉన్నావు. అన్నాచెల్లెలుగా మ‌న ప్ర‌త్యేక అనుబంధం క‌ల‌కాలం కొన‌సాగుతూనే ఉంటుంది. నీ పుట్టిన రోజు అత్యంత అద్భుతంగా, అందంగా సాగాల‌ని ఆకాంక్షిస్తున్నాను అని సంతోష్ కుమార్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా క‌విత మొక్క‌లు నాటిన దృశ్యాల‌ను వీడియో రూపంలో సంతోష్ కుమార్ షేర్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/