ఫ్యామిలీ ఆత్మ హత్య కేసు : వనమా రాఘవ అరెస్ట్

పాల్వంచలో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ ను పోలీసులు అరెస్ట్‌ చేసారు. దమ్మపేట మండలం మందలపల్లిలో భద్రాద్రి పోలీసులు వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ-2గా వనమా రాఘవ ఉన్నారు.

ఈయన ఫై పోలీసులు 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన దగ్గరి నుండి రాఘవ పరారీలో ఉన్నారు. గత రెండు రోజులుగా పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చేసారు. ప్రస్తుతం రాఘవను కొత్తగూడెం కు తరలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నంమే పోలీసులు హైదరాబాద్ లో వనమా రాఘవ ను అరెస్ట్ చేసినట్లు వార్తలు వినిపించాయి కానీ సాయంత్రం మాత్రం రాఘవ ను ఇంకా అదుపులోకి తీసుకోలేదని..అతడి ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నట్లు పోలీసులు చెప్పడంతో కాస్త గందరగోళం ఏర్పడింది. కొద్దీ సేపటి క్రితం రాఘవ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాఘవే అని..రామకృష్ణ ఆత్మ హత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని చెప్పడం జరిగింది. ఈ వీడియో లో రామకృష్ణ సంచలన విషయాలు బయటపెట్టారు.

‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. వనమా రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలి. అతని లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. కానీ ఏ భర్త కూడా వినగూడని మాట వనమా రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్ తీసుకురావాలని అడిగారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు.నేను ఒక్కడినే చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు నా భార్యాపిల్లల్ని తీసుకెళ్తున్నాను. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు. నేను వీళ్లందరితో పోరాటం చేసే స్థితిలో లేను. నా తండ్రి ద్వారా వచ్చే ఆస్తితో నా అప్పులు తీర్చాలి. నాకు సహకారం అందించిన అందరికీ న్యాయం చేయాలి.” అని అన్నారు.