ఎర్రబెల్లి సోదరుడిని బుజ్జగిస్తున్న టిఆర్ఎస్ నేతలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోదరుడు.. ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన్ను బుజ్జగించే పనిలో టిఆర్ఎస్ నేతలు ఉన్నారు. బుధువారం ఎమ్మెల్సీ సారయ్య ప్రదీప్‌ రావు ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడాడారు. ప్రదీప్‌ రావు అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీలో మీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని , ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై దృష్టి పెడతారని తప్పకుండ న్యాయం చేస్తారని , పార్టీని విడొద్దని సారయ్య ప్రదీప్ రావు కు చెప్పినట్లు సమాచారం.

మరోపక్క ఈ నెల 7వ తేదీన ప్రదీప్ రావు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. టీఆర్‌ఎస్‌కు రాజీనామాతో పాటు తన భవిష్యత ప్రణాళికలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రదీప్ రావు రాజీనామా అంశం రాజకీయంగా ఒక్కసారిగా హీటెక్కింది. మంత్రి తమ్ముడే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇక 2023 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పావులు కదుపుతోంది. జాయినింగ్ కమిటీ అని ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి.. దానికి కన్వీనర్ గా ఈటల రాజేందర్ ను నియమించింది. ఈ కమిటీ ద్వారా భారీగా చేరికలు ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు రాజగోపాల్ రెడ్డి. అతి త్వరలో బిజెపి పార్టీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది కూడా బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈటెల చెపుతుండడం ఇటు టిఆర్ఎస్ లోను అటు కాంగ్రెస్ లోను కలవరపెడుతుంది.