భారత్ పర్యటనపై మరోసారి ట్రంప్ ఆసక్తి

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25న భారత్ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో ట్రంప్ భారత్ పర్యటనపై ఉన్న ఆసక్తిని మరోసారి వ్యక్తపరిచారు.మరో రెండు వారాల్లో భారత పర్యటనకు వెళ్లేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారత్‌లో పర్యటనను గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఫేస్బుక్లో తాను నెంబర్ 1, భారత ప్రధాని నరేంద్ర మోడి నెంబర్ 2 అని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల చెప్పారని ట్రంప్ గుర్తుచేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. కాగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ట్రంప్ దంపతులు పర్యటిస్తారు. అహ్మదాబాద్‌లో జరిగే హౌడీ మోడి తరహా సభలో ట్రంప్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడి కూడా పాల్గొంటారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/