మాస్ మహారాజ్ తో టాప్ హీరోయిన్స్.?

దర్శకుడు రమేష్ వర్మ తో చిత్రం ప్లాన్

Ravi Teja
Ravi Teja

మాస్ మహారాజ్ రవితేజ. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ నటుడు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ప్రయోగం “డిస్కో రాజా” విఫలం కావడంతో తనకి ఎంతో పేరు తెచ్చిన మాస్ బాటలోనే అడుగు పెట్టారు.

తన హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో “క్రాక్” అనే మాస్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు. దీని తర్వాత రవితేజ మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

వాటిలో దర్శకుడు రమేష్ వర్మ తో ప్లాన్ చేసిన చిత్రం కూడా ఒకటి.

పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో రవితేజ సరసన ఇద్దరు టాప్ హీరోయిన్స్ ను దర్శకుడు లాక్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్ నిధి అగర్వాల్ మరియు అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రం ఈ అక్టోబర్ మూడో వారంలో హైదరాబాద్ లో మొదలు కానున్నట్టు సమాచారం.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/