పరివ్రాజకులు సమాజ సేవకులు

ఆధ్యాత్మిక చింతన

OM
OM

ధర్మాన్ని ఎవరైతే ప్రచారం చేయదలుస్తారో వారు సంసార జీవితాన్ని సాగించలేరు. ఎప్పటికీ ధార్మిక, ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు.

వారినే పరివ్రాజకులు అంటారు. పరివ్రాజకులు అంటే సన్యాసి అని అర్థం.

పరివ్రాజకుల ధర్మాలు, అర్హతలు, లక్షణాలు, విధులు, నిషేధాలు, యజ్ఞోపవాత ప్రశస్తిలాంటి ఆరురకాల సన్యాసాలు, ఓంకారస్వరూపం, పరమేశ్వర స్వరూపాలను నారదమహర్షులవారు ఉపనిషత్తుల్లో వివరించాడు.

అందులో పరివ్రాజక, త్రిశిభిబ్రాహ్మణ, సీత, చూడా, నిర్వాణ, మండల, దక్షిణామూర్తి, శరభస్కంధ, మహానారాయణ, అద్యయ అనే ఉపనిషత్తులసారం నారద పరివ్రాజకోపనిషత్తులో చెప్పబడినది. పరివ్రాజ్‌ అనగా సమస్త భవబంధాలను విడిచిపెట్టేవాడు అని అర్థం.

సకల భూతజాం తనవల్ల సకల భూతజాలం వల్ల తాను అభయం పొందగలిగే నాడే పరివ్రాత్‌. ఇలా సన్యాసాన్ని స్వీకరించాంటే ఉపనయం తరువాత 12 సంవత్సరాలుపాటు గురుశుశ్రూషలో విద్యాభ్యాసం చేసి 25 సంవత్సరాలపాటు గృహస్థాశ్రమంలో గడపాలి.

ఆ తరువాత తన 50 సంవత్సరాలు వానస్రస్థ ధర్మాలు ఆచరించి 75వ సంవత్సరాల నుంచి జనాలు లేనిచోట అంటే జనసంచారం లేనిచోట ఒక గృహాన్ని నిర్మించుకుని సత్కర్మలను ఆచరిస్తూ సన్యాస జీవనం గడపాలని పరివ్రాజకోపనిషత్తు తెలియజేస్తోంది.

అంతేకాకుండా సన్యాసాన్ని స్వీకరించినవారు ఎలాంటి కర్మలు చేయాలో, ఎలాంటి లక్షణాలు కల్గి ఉండాలో కూడా ఇందులో చెప్పబడింది.

సన్యాసం తీసుకున్నవారు ఎలాంటి కోరికలు వైరాగ్యాన్ని కల్గి ఉండరాదు.

జిహ్వ, ఉపస్థ, ఉదరం, హస్తం ఈ నాలుగు విషయాలను తన అదుపులో ఉంచుకోవాలి.

పరమాత్మపై అనురక్తి కలిగి ఉండాలి. శాంతి, శమం, శౌచం, సంతసం, సత్యల, ఆర్జవల, దీనత్వం లేకపోవడం, రంభం లేకపోవడం అనే అష్టసుగుణాలు కల్గి ఉండాలని పరివ్రాజకోపనిషత్తు చెబుతోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/