సింపుల్గా జరిగిన హీరో నిఖిల్ పెళ్లి


హైదరాబాద్: యవ కథానాయకుడు నిఖిల్ వివాహం ఈరోజు ఉదయం డాక్టర్ పల్లవీ వర్మతో జరిగింది. హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరి వివాహం జరిగింది. లాక్ డౌన్ నిబంధనలు, కరోనా కారణంగా కొద్ది మంది బంధువులు, మిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా, కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ తరువాత తొలుత ఏప్రిల్ 16న వివాహం జరపాలని భావించారు. ఈలోగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో పెళ్లిని వాయిదా వేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/