నార్సింగి రోటరీ వద్ద కోటి రూపాయిలను సీజ్ చేసిన పోలీసులు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బులు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున నగదును పట్టుకున్న పోలీసులు..శనివారం రాత్రి మునుగోడు కు తరలిస్తున్న కోటి రూపాయిలను పోలీసులు పట్టుకొని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

మణికొండలోని ఓ విల్లా నుంచి రూ.1 కోటి నగదును మునుగోడులో ఉన్న సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డిలకు అందజేసేందుకు నలుగురు వ్యక్తులు కారులో బయలుదేరారు. నార్సింగి రోటరీ వద్దకు రాగానే పోలీసులు కనిపించడంతో వీరు కారు వేగాన్ని పెంచారు. దీంతో అనుమానించిన పోలీసులు వీరిని వెంబడించి మరీ కారును పట్టుకున్నారు. కారును సోదా చేయగా… అందులో రూ.1 కోటి నగదు బయటపడింది. నగదుతో పాటు కారులోని నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా… సుమంత్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిల పేర్లు బయటపెట్టారు. ప్రస్తుతం పోలీసులు వీరి కోసం గాలిస్తున్నారు.