రేపు భక్తులకు శ్రీవారి దర్శనం బంద్‌

రేపు ఉదయం 10:18 నుంచి 1:38 వరకు గ్రహణం

tirumala temple
tirumala temple

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం రేపు సూర్యగ్రహణం కారణంగా మూతబడనుంది. ఈరోజు రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 10:18 గంటల నుంచి మధ్యాహ్నం 1:38 గంటల వరకు సూర్యగ్రహణం ఉండడంతో మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం రోజువారి కైంకర్యాలు నిర్వహించి రాత్రి 8:30 గంటలకు ఏకాంత సేవ నిర్వహిస్తామని, కైంకర్యాల నిర్వహణలో భాగంగా రేపు భక్తులకు దర్శనం ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/