ఆహ్లాదకర వాతావరణానికి..

Indoor plants

నెగెటివ్‌ ఎనర్జీ పోవాలంటే మానసిక ప్రశాంతతకు ఇంట్లో వాతావరణం బాగుండేలా చూసుకోవాలి. ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు తెరచి ఉంచాలి. సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోవాలి. గాలి, సూర్యకిరణాలు నెగెటివ్‌ ఎనర్జీని తొలగిస్తాయి.
పాత వస్తువులను, పనికిరాని వస్తువులను తొలగించాలి. పాత వస్తువులు నెగెటివ్‌ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అప్పటి కాలంలో చెప్పులు ఇంటి బయటే విడిచి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారు కాదు. దానివల్ల నెగెటివ్‌ ఎనర్జీ ఇంట్లోకి వచ్చేది కాదు. అలా చెప్పులతో ఇంట్లోకి రాకుండా బయటే విడిచి కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. అందువల్ల నెగెటివ్‌ ఎనర్జీ ఇంటి దరిదాపులకు చేరదు. పార్కులో కాని, విశాలమైన మైదానంలో కాని కాసేపు నడవాలి. ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల శరీరం ఉత్తేజం పొందుతుంది. ఇంట్లో దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి. బకెట్‌ నీళ్లలో కొద్దిగా రాక్‌సాల్ట్‌ వేసి ఆ నీటితో ఇల్లు తుడిస్తే నెగెటివ్‌ ఎనర్జీ పోతుంది. ఇంటి వసారాల్లో, గదుల మూలల్లో పూల మొక్కలు పెంచుకుంటే పాజిటివ్‌ ఎనర్జీ చేరుతుంది. ఇంట్లో పూజలు, ప్రార్థనలు చేయడం వల్ల పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ పెరుగుతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/