అక్టోబర్ 20 న రాబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’

మాస్ రాజా రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ధమాకా , వాల్తేర్ వీరయ్య మూవీస్ తో హిట్స్ అందుకున్న రవితేజ..ప్రస్తుతం రావణాసుర మూవీ తో ఏప్రిల్ 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించి అభిమానుల్లో సంబరాలు నింపారు.

రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. ఈ సినిమాకి మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 1970 – 80లలో స్టువర్ట్ పురం గజదొంగగా పోలీసులకు నిద్రలేకుండా చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ ఇది. నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, దసరా పండుగ కానుకగా, అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ లో రేణు దేశాయ్ హేమ‌ల‌త ల‌వ‌ణం అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషిస్తోంది. చాలాకాలం తర్వాత రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తుండడం తో అందరిలో ఆసక్తి మరింత పెరిగింది.