తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా., ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఆదివారం కావడంతో సరదాగా బీచ్ కు వెళ్లినవారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఇక బీచ్ లో వారు సరదాగా సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతు అయినట్లు తెలుస్తుంది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న మత్స్యకారులు కాపాడడానికి ట్రై చేసిన అప్పటికే ఇద్దరు యువతులు మృతి చెందారు. మృతిచెందిన ఇద్దరి యువతులు అక్కా చెల్లెలుగా గుర్తించారు. మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం, కనకదుర్గ గా వారిని గుర్తించారు. ఈ సంఘటనతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు.