జగన్‌లా నేను పిరికివాడిని కాదు : కుప్పం సభలో చంద్రబాబు

Chandrababu in Kuppam tour-

Kuppam (Chittor District): జగన్‌లా తాను పిరికివాడిని కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. వైఎస్‌ వివేకా హత్య కేసుపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయన్నారు. 9 నెలల జగన్‌ పాలన నరకాసుర పాలన అని విమర్శించారు.

జగన్‌ లాంటి చెత్త ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. తాను కక్ష సాధించి ఉంటే వైసీపీ నేతలు బయట తిరిగేవారు కాదన్నారు.

ప్రజా సమస్యలపై పోరాటం తీవ్రతరం

ప్రజా సమస్యలపై పోరాటం తీవ్రతరం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేశారు? అని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల మూసివేతపై నిరసన కొనసాగిస్తున్నామన్నారు.

ఏపీలో ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు. ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆంధ్ర ఇసుక కర్ణాటకకు తరలిపోతోందన్నారు. రాయలసీమ ప్రజలు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

పోలీసులు ప్రజాస్వామ్య బద్ధం గా పనిచేయాలి

పోలీసులు ప్రజాస్వామ్యబద్దంగా పని చేయాలని, వైసీపీకి తొత్తుగా కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మా దిష్టిబొమ్మలు కాలిస్తే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సీఎం దిష్టిబొమ్మలు కాలిస్తే మాత్రం పోలీసులకు పూనకం వస్తుందని విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/