సంగారెడ్డి జిల్లాలో విషాహారం తిని ముగ్గురు మ‌ర‌ణం..

మరో ఇద్దరి పరిస్థితి విషమం!

Three killed in Sangareddy district
Three killed in Sangareddy district

Hyderabad: సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. అదే ఆహారం తిన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

చికిత్స కోసం బాధితులిద్దరిని హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం రాత్రి ఐదుగురు కుటుంబ సభ్యులు జొన్నరొట్టెలు తిన్నారు. ఇందులో సుశీలమ్మ, చంద్రమౌళి, శ్రీశైలం మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇదే కుటుంబానికి చెందిన మహిళ 15 రోజుల కిందట మృతి చెందింది. చనిపోయిన మహిళ వినియోగించి పిండిని వినియోగించి కుటుంబ సభ్యులు రొట్టెలు చేసుకొని తిన్నారు.

అయితే జొన్నపిండిలో విష పదార్థం కలిసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/