కెన్యాలోని అమెరికా మిలటరీ స్థావరంపై ఉగ్రదాడి

దాడిలో ముగ్గురు అమెరికన్లు మృతి

military
military

కెన్యా: కెన్యాలోని అమెరికా మిలటరీ స్థావరంపై జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు అమెరికా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గంటల వ్యవధిలో ఈ స్థావరంపై జరిగిన రెండో దాడి ఇది. మృతులలో ఒకరు మిలటరీకి చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు కాంట్రాక్టర్లు. కెన్యాలోని లమూ తీర ప్రాంతంలో ఉన్న ఈ స్థావరంపై సోమాలియాకు చెందిన జిహాదీ సంస్థ అల్షబాబ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రసంస్థకు ఆల్ ఖాయిదా సంస్థతో సంబంధాలున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/