కరోనా వైరస్‌: 490 కి చేరిన మృతులు

వుహాన్‌లో పరిస్థితి దారుణం.. సిటీ లాక్‌డౌన్‌

Corona virus effect
Corona virus effect

వుహాన్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 490కి చేరుకున్న‌ది. కేవ‌లం హుబేయ్ ప్రావిన్సులోనే మంగ‌ళ‌వారం మ‌రో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20కి పైగా దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అయ్యాయి. చైనాలో వైర‌స్ సోకిన కేసులు సుమారు 24వేల‌కు చేరుకున్న‌ది. చైనా చేస్తున్న నియంత్రణ ఏర్పాట్లు వ‌ల్ల క‌రోనా వ్యాప్తి అదుపులో ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మంగ‌ళ‌వారం పేర్కొన్న‌ది. హుబేయ్ ప్రావిన్సులో సుమారు 5 కోట్ల మందిని క్వారెంటైన్ చేసిన‌ట్లు స‌మాచారం. వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా వున్న హుబేయ్ రాజ‌ధాని వుహాన్‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉన్న‌ది. మొత్తం సిటీని లాక్‌డౌన్ చేశారు. బ‌య‌ట‌కు వెళ్లేవారు కానీ, లోప‌లికి వ‌చ్చేవాళ్లు కానీ ఎవ‌రూ లేరు. శ్వాస‌కోస వ్యాధులు వ‌స్తున్న నేప‌థ్యంలో చైనాలో ఎవ‌రూ ఉండ‌కూడ‌ద‌ని బ్రిట‌న్ తమ దేశ టూరిస్టుల‌కు ఆదేశాలిచ్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/