కశ్మీర్‌లో పరిస్థితులు మరింత దిగజారాయి

రాళ్లు రువ్వే సంఘటనలు గతంలో కంటే చాలా పెరిగాయి

adhir ranjan chowdhury
adhir ranjan chowdhury

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని దానితో పాటు ఆర్టికల్ 35ఏను రద్దు చేసి ఆరు నెలలు గడుస్తోందని, అయితే అక్కడ పరిస్థితులు మరింత దిగజారాయని లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదురి అన్నారు. 2019లో రాష్ట్రంలో రాళ్లు రువ్వే సంఘటనలు గతంలో కంటే చాలా పెరిగాయని అధిర్ అన్నారు. ఈ లెక్కలు తాను చెబుతున్నవి కావని, ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కలని అన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు చేసి ఆరు నెలలకు పైగా గడిచింది. కానీ కశ్మీర్‌పై అధికారిక లెక్కలు వెల్లడిస్తున్న వాస్తవాలు భయంకరంగా ఉన్నాయి. కశ్మీర్‌లో రాళ్లు విసిరే సంఘటనలు గతంలో కంటే ఎక్కువయ్యాయి. గడిచిన రెండేళ్లతో పోల్చుకుంటే ఇవి బాగా పెరిగాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/