ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు..

పుట్టిన పిల్లలో ఇద్దరూ భూమి మీదకు వచ్చిన వెంటనే కన్నుమూశారు

mp-woman-gives-birth-to-6-babies-two-infants-die
mp-woman-gives-birth-to-6-babies-two-infants-die

మధ్యప్రదేశ్‌: ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, ఆ ఆనందం పది మందితో పంచుకునేలోపే విషాదం నిండింది. పుట్టిన పిల్లల్లో ఇద్దరు భూమి మీదకు వచ్చిన వెంటనే కన్నుమూశారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని షాపోర్ జిల్లాలో ఉన్న బడోడా ప్రాంతానికి చెందిన 23 సంవత్సరాల మహిళ జిల్లా ఆస్పత్రిలో ఆరుగురికి జన్మనిచ్చింది. 35 నిమిషాల వ్యవధిలో ఆరుగురు పిల్లలు జన్మించారు. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. అయితే, నలుగురు అబ్బాయిలు బతికారు. ఇద్దరు ఆడపిల్లలు చనిపోయారు. అబ్బాయిల బరువు 615 గ్రాముల నుంచి 790 గ్రాముల మధ్యలో ఉన్నారు. ఆడపిల్లల్లో ఒకరు 390 గ్రాములు, మరొకరు 450 గ్రాములు ఉన్నారు. దీంతో వారిద్దరూ చనిపోయారు. మిగిలిన నలుగురికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ మహిళ గర్భం దాల్చిన 28వ వారంలో కాన్పు జరిగింది. తాను ఆరుగురు పిల్లలకు జన్మనిస్తున్న విషయం వారం క్రితమే ఆమెకు తెలిసింది. సహజంగా ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్ తీసుకున్న వారికి ఇలా ఒకే కాన్సులో ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయని వైద్యులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/