11 మంది చిన్నారులను రక్షించిన హైదరాబాద్‌ పోలీస్‌

Children Rescued From Traffickers
Children Rescued From Traffickers

హైదరాబాద్‌: నగరంలోని పోలీసులు ఓ అనూహ్యమైన సాహాసం చేసి అందరి మన్ననలను పొందారు. మానవ అక్రమ రవాణాదారుల నుంచి హైదరాబాద్‌ పోలీసులు 11 మంది చిన్నారులను కాపాడారు. ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో ఓ బస్సులో కొందరు చిన్నారులు అనుమానాస్పదంగా కనపడడంతో ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వారిని రక్షించారు. ‘ఎల్బీనగర్‌ ఎక్స్ రోడ్‌ వద్ద ఓ బస్సులో చిన్నారులు ఉన్న విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో వారిని వెంటనే కాపాడి సైదాబాద్‌లోని చిన్నారుల శిబిరానికి పంపారు. ఆ చిన్నారులను ఛత్తీస్‌గఢ్ నుంచి కొందరు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారితో కూలీ పనులు చేయించాలనుకున్నారు’ అని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/