రామ్ ‘వారియర్ ‘ నుండి సెకండ్ సింగిల్ రాబోతుంది

ఎనర్జిటిక్ స్టార్ రామ్ – ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రాబోతుంది. ఇప్పటికే బుల్లెట్ సాంగ్ విడుదలై శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు, హరిప్రియ పాడారు. శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. పాటకి తగిన స్టెప్పులతో రామ్ – కృతి శెట్టి చెలరేగిపోయారు.

ఇకఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ ను మేకర్స్ ప్రకటించారు. ‘ద‌డ ద‌డ’ అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్ జూన్ 4న మ‌ధ్యాహ్నం 12.07 నిమిషాల‌కు విడుద‌ల కానున్నట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. మరి ఈ సాంగ్ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. జులై 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రామ్ పోతినేని. పూరీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాతో రామ్ త‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు. అప్ప‌టివ‌ర‌కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను ఏర్ప‌ర‌చుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో పూర్తి మాస్ హీరోగా మేకోవ‌ర్ అయ్యాడు. గతేడాదిలో వ‌చ్చిన ‘రెడ్‌’లో కూడా సిద్ధార్థ పాత్ర‌లో మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పోలీస్ గెటప్ లో వారియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.