హైదరాబాద్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..ఈరోజు కొత్తగా నాల్గు

ఒమిక్రాన్ మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతుంది. మొన్నటివరకు తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాలేదని అంత అనుకున్నారో లేదో..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసులు పెరుగుతుండడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఈ నాలుగు కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఈ నాలుగు కేసులు బయటపడ్డాయి.. మరో ముగ్గురి ఫలితాలు తెలియాల్సి ఉంది.ఒమిక్రాన్ సోకిన వారిలో ముగ్గురు కెన్యా నుంచి వ‌చ్చిన వార‌ని.. మ‌రొక‌రు ఇండియా వ్యక్తేనని స‌మాచారం.. దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇక ఏపీలో ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదైనా.. దాదాపు అన్ని జిల్లాల్లోనూ విదేశీ ప్రయాణికులున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొత్త వేరియట్ వచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులుగా ఎక్కడ విన్న ఒమిక్రాన్ పైనే చర్చ జరుగుతోంది. కోనసీమకు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో అది ఒమిక్రాన్ అని జనం హడలిపోతున్నారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి జిల్లాకు 2,746 మంది విదేశీ ప్రయాణికులు రాగా.. వారిలో 2,673 మందిని గుర్తించారు. వారిలో 928 మందికి కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్ గా తేలింది.