ముచ్చటగా మూడోసారి

పోలీస్‌ ఆఫీసర్‌గా రామ్‌చరణ్‌

Ram charan
Ram charan

రామ్‌చరణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దాదాపు13 ఏళ్లు అవుతుంది.. 2007లో ‘చిరుత మూవీతో వెండితెరకు పరిచయమైన ఆయన ఇప్పటిదాకా 12 చిత్రాలు చేశారు..

చేసిన కొద్దిసినిమాల్లో చరణ్‌ రెండుసార్లు పోలీసుపాత్ర చేయటం జరిగింది.

మొదటిసారి హిందీ చిత్రం జంజీర్‌కు రీమేక్‌గా ఆయన చేసి బైలింగ్వల్‌మూవీలో అసిస్టెంట్‌ కమిషనర్‌ రోల్‌ చేశారాయన. ఇక దర్శకుడు సురేందర్‌రెడ్డి తెరకెక్కించిన ‘ధృవ చిత్రంలో కూడ ఆయన ఐపిఎస్‌ అధికారి పాత్ర చేశారు.

ఈ రెండు చిత్రాల్లో పోలీస్‌గా చరణ్‌ సక్సెస్‌ అయ్యారనే విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి చరణ్‌ పోలీస్‌గా కన్పించబోతున్నారు.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్‌ అల్లూరి పాత్ర చేస్తుండగా, ఆయన ఓ గెటప్‌ళో పోలీస్‌గా కన్పిస్తారని తెలిసింది.

చరణ్‌ బర్త్‌డే కానుకగా రాజమౌళి విడుదల చేసిన వీడియోలో ఆయన్ని పోలీస్‌గానే పరిచయం చేశారు.. అల్లూరి సీతారామరాజు పోలీస్‌ ఎలా అయ్యాడు.. అనేది ట్విస్ట్‌..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/