మాది కరోనా ఫ్రీ కంట్రీ.. ఉత్తరకొరియా

అనుమానాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు

kim jong- un
kim jong- un

ఉత్తర కొరియా: ప్రపంచం మొత్తం కరోనా బారిన పడి విలవిలలాడుతుంటే, ఉత్తర కొరియా మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రకటనలు చేస్తుంది. మాది కరోనా ఫ్రీ కంట్రీ అని, ఇప్పటి వరకు మా దేశంలో కరోనా కేసులు నమోదకాలేదని, ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. మొదటగా చైనాలో ఈ వైరస్‌ తొలికేసు నమోదు అయిన వెంటనే, తమ దేశ సరిహద్దులను మూసివేయించాం. అందుకే మా దేశంలోకి ఈ వైరస్‌ ప్రవేశించలేకపోయింది అని ఆదేశ యాంటి-ఎపిడమిక్‌ విభాగం డైరెక్టర్‌ పాక్‌ మియాంగు సు తెలిపారు. దీనిపై ప్రపంచదేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ వైరస్‌ బారిన పడి విలవిలలాడుతుంటే ఉత్తరకొరియా మాత్రం కరోనా ఫ్రీ కంట్రీ అని పేర్కోనడం అనుమానాలకు తావిస్తోందని ప్రపంచ మేధావులు, నిపుణులు అంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/