పవన్ కళ్యాణ్ – అలీ మధ్య జరిగింది ఇదే – నాగబాబు క్లారిటీ

చిత్రసీమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – అలీ ఎంత మంచి స్నేహితులో చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ నటించారు. ఒకానొక సమయంలో అలీ తన సినిమాలో లేకపోతే ఏదో వెలితి గా ఉంటుందని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అలాంటి స్నేహితులను రాజకీయాలు దూరం చేసాయి. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో అలీ చేరతారని అంత అనుకున్నారు. కానీ అలీ మాత్రం పవన్ కు ప్రత్యర్థి అయినా జగన్ పార్టీ లో చేరి షాక్ ఇచ్చాడు. అలీ జనసేన పార్టీ ని కాదని వైస్సార్సీపీ లో చేరడం మెగా అభిమానులకే కాదు ఆయన అభిమానులకు కూడా నచ్చలేదు. ఈ మధ్యనే అలీ కి వైస్సార్సీపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇచ్చింది. ఇక రీసెంట్ గా అలీ జగన్ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేసేందుకైనా సిద్ధమన్న సంకేతాలు సైతం ఇవ్వడం మెగా అభిమానుల్లో మరింత ఆగ్రహం పెంచింది. ప్రస్తుతం ఆ వేడిలోనే మెగా అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉంటె తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పవన్ – అలీ మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. “అలీ మాటలను సీరియస్ గా తీసుకోలేదు. అటు పవన్ కల్యాణ్ కూడా అలీని తిట్టింది లేదు. ఎందుకు తిడతాం? కల్యాణ్ బాబు ఏమన్నాడంటే… అలీకి ఎంతో ఉపయోగపడ్డాం కదా… ఇలా వెళ్లిపోతాడనుకోలేదు అన్నాడు. నాకేం ఉపయోగపడ్డాడు అని అలీ అన్నాడు. ఇదే జరిగింది! ఆ తర్వాత అలీ తన కుమార్తె పెళ్లికి పవన్ ను ఆహ్వానించడం జరిగింది. నా ఎదురుగానే పవన్ కు పెళ్లి కార్డు ఇచ్చాడు. అలీ నా దగ్గరకు కూడా వస్తుంటాడు… మేం కలుస్తుంటాం. అయితే అలీ కుమార్తె పెళ్లి సమయంలో పవన్ మంగళగిరిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఒకసారి పార్టీలోకి వెళ్లిన తర్వాత అధిష్ఠానం ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. అలీ కూడా అంతే. పార్టీ హైకమాండ్ చెబితే పోటీ చేస్తానన్నాడు తప్పితే, ఏదో మనసులో పెట్టుకుని అన్న మాటలు కావు. గతంతో పోల్చితే పవన్, అలీ మధ్య ఇప్పుడు సఖ్యత కాస్త తక్కువే. ఎవరి జీవితాలు వారివి” అని చెప్పుకొచ్చారు.